365 బీ నేషనల్ హైవే అలైన్​మెంట్​ మార్పు .. రైతుల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిన ఎంపీ రఘునందన్​రావు

365 బీ నేషనల్ హైవే అలైన్​మెంట్​ మార్పు .. రైతుల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిన ఎంపీ రఘునందన్​రావు
  • జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమా శంకర్ కు వినతిపత్రం అందజేత

సిద్దిపేట, వెలుగు: సూర్యాపేట నుంచి సిద్దిపేట మీదుగా సిరిసిల్లకు వెళ్లే 365బీ  నేషనల్ హైవే అలైన్​మెంట్​మార్పునకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సానుకూలంగా స్పందించారు. రైతులకు ఊరటనిచ్చే విధంగా కొత్త అలైన్​మెంట్​పరిశీలనకు అంగీకరించారు. రైతుల తరఫున ఎంపీ రఘునందన్ రావు  రైతుల ప్రతినిధి బృందాన్ని మంగళవారం ఢిల్లీకి తీసుకెళ్లారు. జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమా శంకర్​ను కలిసి రైతులు నష్టపోకుండా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 

రైతులు భూములు కోల్పోకుండా రాజీవ్ రహదారి, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తే ఎవరికీ నష్టం జరగదని కొత్త అలైన్​మెంట్ మార్గాన్ని ఎంపీ అధికారుల మందు  ప్రతిపాదించారు. ఈ అంశంపై  అధికారులు స్పందించి పాత అలైన్మెంట్ జరుగుతున్న భూ సర్వేను నిలిపివేసి కొత్త అలైన్​మెంట్​ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ రఘునందన్ రావు ప్రయత్నాన్ని రైతులు అభినందించారు. ఆయన వెంట రైతులు రాంరెడ్డి, నర్సింలు, సందీప్ రావు, తిరుపతి, రాజలింగం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, సంతోష్ పాల్గొన్నారు.