NIT వరంగల్‌లో ఉద్యోగాలు: బీటెక్, ఎంటెక్ చేసినోళ్లు అస్సలు మిస్సవకండి...

NIT వరంగల్‌లో ఉద్యోగాలు: బీటెక్, ఎంటెక్ చేసినోళ్లు అస్సలు  మిస్సవకండి...

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, వరంగల్ (NIT) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

మొత్తం ఖాళీలు: 2. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్ పూర్తి చేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జూన్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  nitw.ac.inను సందర్శించండి.