మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ అరికట్టేందుకు ఎన్ఎంసీ చర్యలు

మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ అరికట్టేందుకు ఎన్ఎంసీ చర్యలు

హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ను అరికట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ( ఎన్ఎంసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆగస్టు12న భారత ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవాన్ని, ఆగస్టు 12 నుంచి18 వరకు ర్యాగింగ్ వ్యతిరేక వారాన్ని జరుపుకోవాలని మెడికల్ కాలేజీలు, వైద్య సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.

ర్యాగింగ్ ను నిరోధించేందుకు ఎన్‌‌‌‌ఎంసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. అవగాహన కార్యక్రమాలు, సెలబ్రేషన్స్, లోగో రూపకల్పన, వీడియోలు, నాటకాలు, పోస్టర్ల తయారీ, ఫొటోగ్రఫీ పోటీలు, క్విజ్‌‌‌‌లు, డిబేట్‌‌‌‌లు నిర్వహించాలని సూచించింది. సోషల్ మీడియా, వీడియోల ద్వారా యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ కల్పించాలని పేర్కొంది. ర్యాగింగ్ వ్యతిరేక కార్యక్రమాల వివరాలను యూజీసీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేసి, నివేదికను సమర్పించాలని ఆదేశించింది.