మైనారిటీల సంక్షేమానికి కృషి చేయాలి: షాహజాదీ

మైనారిటీల సంక్షేమానికి కృషి చేయాలి: షాహజాదీ

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: మైనారిటీల సంక్షేమానికి అధికారులు కృషి చేయాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహజాదీ ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ మీటింగ్​హాల్​లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మైనారిటీల సంక్షేమానికి సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. 

మహిళా శిశు సంక్షేమం, పాఠశాల విద్యా, ఉర్దూ బోధన, మదర్సా విద్య, ఉపకార వేతనాలు, విద్యా మౌలిక సదుపాయాల కల్పన, స్వయం ఉపాధి, సాంకేతిక శిక్షణ, రుణ సహాయం, నియామకాలు, గ్రామీణ గృహ నిర్మాణం, మైనారిటీ వాడల అభివృద్ధి, మత పరమైన ఘర్షణల నియంత్రణ, నేరాల విచారణ, బాధితులకు పునరావాసానికి సంబంధించి మైనారిటీల సంక్షేమానికి 15 సూత్రాల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపి, వాటి అమలుపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, శాఖల అధికారులు పాల్గొన్నారు.