ఐఆర్​ఎస్​ వ్యవస్థ.. బిట్ బ్యాంక్ 

ఐఆర్​ఎస్​ వ్యవస్థ.. బిట్ బ్యాంక్ 
  • భారతదేశంలో ఇండియన్​ రిమోట్​ సెన్సింగ్​ (ఐఆర్​ఎస్​) వ్యవస్థ మొదటిసారిగా 1998లో ఐఆర్​ఎస్​–1ఏ ప్రయోగం ద్వారా ప్రారంభించబడింది. 
  • ఒక వస్తువు నుంచి వచ్చే వికిరణం ఆధారంగా ఆ వస్తువు లక్షణాలను, దూరాన్ని తెలుసుకోవడాన్ని రిమోట్​ సెన్సింగ్​ అంటారు. 
  • రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం రిజల్యూషన్​ శక్తి. 
  • రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచే స్పష్టంగా చూడటాన్ని రిజల్యూషన్​ శక్తి అంటారు. 
  • రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల్లోని సెన్సర్లు సేకరించిన సమాచారాన్ని నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​కు పంపిస్తారు. 
  • నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​ హైదరాబాద్​లో ఉంది.
  • రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నేషనల్​ నేచురల్​ రిసోర్సెస్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ నిర్వహిస్తుంది.
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వాతావరణ సమాచార సేకరణకు, విపత్తుల నిర్వహణకు, రవాణా వ్యవస్థ మెరుగుదలకు ఉపరితల చిత్రీకరణకు ఉపయోగిస్తారు. 
  • ఈ ఉపగ్రహాలను 500 నుంచి 1500 కి.మీ.ల సన్​ సింక్రోనస్​ ఆర్బిట్స్​ కక్ష్యలో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహాలను ప్రయోగించడానికి పీఎస్​ఎల్​వీ నౌకలను ఉపయోగిస్తారు.
  • మన దేశంలోని రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల్లో  ఉపయోగిస్తున్న సెన్సర్లు, స్కానర్లు లీనియల్​ ఇమేజింగ్​ సెల్ఫ్ స్కానర్​, అడ్వాన్స్​డ్​ వైడ్​ఫీల్డ్​ సెన్సార్స్​, మాడ్యులర్​ ఆప్టో ఎలక్ట్రానిక్​ స్కానర్, ఓసియన్​ కల్​ మానిటర్​, ప్రాక్రోమాటిక్​ కెమెరా. 

అనువర్తనాలు

  • పంట విస్తీర్ణం ఆధారంగా పంట కోసే ముందే దిగుబడిని అంచనా వేసే క్రాప్​ యావరేజ్​ అండ్​ ప్రొడక్షన్​ ఎస్టిమేట్​ (సీఏపీఈ) కార్యక్రమాన్ని రిమోట్​ సెన్సింగ్ ఉపగ్రహాల సహాయంతో ఇస్రో నిర్వహిస్తుంది. దీని ఆధారంగా భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న, తొమ్మిది రాష్ట్రాల్లో నూనెగింజలు, ఐదు రాష్ట్రాల్లో పత్తి దిగుబడిని అంచనా వేస్తున్నారు. 
  • కేంద్ర ప్రభుత్వం పంట కోతకు ముందు దిగుబడిని అంచనా వేసే ఎఫ్​ఏఎస్​ఏల్​ కార్యక్రమాన్ని ఇస్రో నిర్వహిస్తోంది.
  • ఐఆర్ఎస్​ ఉపగ్రహాల ద్వారా నేలల సారవంతం, ఏ సమయంలో ఎలాంటి పంటలు వేయాలి, చీడపీడల వ్యాప్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. 
  • ఏ ప్రదేశంలో ఎంత అటవీ విస్తీర్ణం ఉన్నది, రిజర్వాయర్లలో నీటి మట్టం, జీవ వైవిధ్యం ఉనికికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. 
  • బంజరు భూముల పునరుద్ధరణకు కార్యక్రమాలను పరిశీలించడానికి ఐఆర్​ఎస్​ ఉపయోగపడుతుంది. 1986లో బంజరు భూముల మ్యాపింగ్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
  • చేపల సాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించే కార్యక్రమాన్ని 1993లో ప్రారంభించారు.

ఇన్​శాట్​

  • ఇండియన్​ నేషనల్​ శాటిలైట్​(ఇన్​శాట్) ఉపగ్రహాలను జీఎస్​ఎల్​వీ వాహక నౌక ద్వారా జియో స్టేషనరీ ఆర్బిట్​ కక్ష్యలో ప్రవేశ పెడుతారు.
  • భారతదేశంలో ఇన్​శాట్​ వ్యవస్థ 1982 ఏప్రిల్​ 10న ఇన్​శాట్​ –1ఏ ప్రయోగం ద్వారా ప్రారంభమైంది.
  • ఫ్రెంచ్​ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియేన నౌకల ద్వారా కొన్ని ఇన్​శాట్​ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. 

అనువర్తనాలు 

  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 620 ప్రధాన టెలికమ్యూనికేషన్స్​ టెర్మినల్స్​ ద్వారా మొబైల్​, ల్యాండ్​లైన్​ సేవలు అందుబాటులో ఉన్నాయి. 
  • ఇన్​శాట్​ ఉపగ్రహాల కారణంగా మనకు ప్రస్తుతం 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. 
  • టెలిమెడిసిన్​ సేవల కోసం ఇన్​శాట్​ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. 
  • భూ ఉపరితల సమాచార వ్యవస్థను ఇన్​శాట్​ ఉపగ్రహం సహాయంతో ఇస్రో అభివృద్ధి చేసింది.
  • కల్పనా –1 అనే ఇన్​శాట్​ ఉపగ్రహం అందించే వాతావరణ సమాచారాన్ని ఇండియన్​ మెటియలాజికల్​ డేటా ప్రాసెసింగ్​ సిస్టమ్​ విశ్లేషిస్తుంది. దీనివల్ల తుపానులు, వరదులు, ఉపరితల ఉష్ణోగ్రత మొదలైన అంశాల సమాచారం అందుతుంది. 
  • ఆన్​లైన్​ మనీ ట్రాన్స్​ఫర్​, ఆన్​లైన్​ రిజర్వేషన్​, ఏటీఎం వంటి సేవలను ఇన్​శాట్​ ఉపగ్రహాలు అందిస్తున్నాయి.
  • ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్య కార్యక్రమాలను ఇన్​శాట్​ ఉపగ్రహాల ద్వారా సఫలీకృతం అవుతున్నాయి.