దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు

దేశవ్యాప్తంగా  వినాయక చవితి ఉత్సవాలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోనూ పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు . ముంబైలోని లాల్ బాగ్చా రాజా పండల్ కు భారీగా భక్తులు తరలివచ్చారు. గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచే భారీగా భక్తులు వచ్చారు. గణేశుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పది రోజుల పాటు గణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు వస్తారని.. అవసరమైన ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.



మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో వినాయక పూజలు ప్రారంభమయ్యాయి. నాగపూర్ లోని శ్రీ గణేశ్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నిర్వహించిన గణేశ్ ఆర్తి కోసం భారీగా భక్తులు హాజరయ్యారు. మరోవైపు..ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో కూడా పూజలు కొనసాగుతున్నాయి. గణనాథుడి దర్శనానికి భారీగా భక్తులు హాజరయ్యారు. వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు . తన సతీమణితో కలిసి ఆయన నివాసంలో గణేశుడికి పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ప్రశాంతగా గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.



ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్ లో 3 వేల 425 ఇసుక లడ్డూలతో వినాయకుడి చిత్రాన్ని కలర్ ఫుల్ గా రూపొందించారు. రెండు ఏనుగులు గణేశుడికి పూజలు చేస్తున్నట్లు సాండ్ ఆర్ట్ రూపొందించారు. హ్యాపీ గణేశ్ పూజ అని సందేశమిచ్చారు. మట్టి వినాయకులనే పూజించి పర్యావరనాన్ని కాపాడాలని కోరారు.