మావోయిస్టుల బంద్ ప్రశాంతం..బీజాపూర్ లో కుట్ర భగ్నం

మావోయిస్టుల బంద్ ప్రశాంతం..బీజాపూర్ లో కుట్ర భగ్నం
  •     వేర్వేరు చోట్ల ఏడుగురు అరెస్ట్ 

భద్రాచలం, వెలుగు : మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్​కౌంటర్​ను నిరసిస్తూ మావోయిస్టులు ఆదివారం నిర్వహించిన దేశవ్యాప్త బంద్​ప్రశాంతంగా ముగిసింది.  దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించడంలో భద్రతాబలగాలు విజయవంతం అయ్యాయి. ఆంధ్రా, చత్తీస్​గఢ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించి నిఘాను పెంచారు. డామినేషన్​టీంలు దండకారణ్యాన్ని జల్లెడ పట్టాయి. చత్తీస్​గఢ్​లోని బీజాపూర్​జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల మావోయిస్టుల కుట్రను భగ్నం చేశాయి. 

నైమేడ్​పోలీస్​స్టేషన్​పరిధి కండకా-జాపేలీ అడవుల్లో 210 కోబ్రా బలగాలు కూంబింగ్​చేస్తుండగా ఐదుగురు, భూపాలపట్నం పోలీస్​స్టేషన్​పరిధి మట్టిమరక శివారులో మొబైల్​చెకింగ్​పార్టీకి ఇద్దరు మావోయిస్టులు పట్టుబడ్డారు.  టిఫిన్​ బాక్సు బాంబులు, డిటొనేటర్లు, కార్డెక్స్ వైరు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా, -తెలంగాణ బార్డర్ లోని భద్రాచలం – -చింతూరు రూట్ లో ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. రాత్రి వేళ చత్తీస్​గఢ్, ఒడిశా, ఏపీలకు భద్రాచలం నుంచి బస్సులను బంద్ పెట్టారు.