కామారెడ్డి జిల్లాలో నత్తగుల్ల శిలాజాలు.. 6.5 కోట్ల ఏండ్ల కిందటివని అంచనా

కామారెడ్డి జిల్లాలో నత్తగుల్ల శిలాజాలు.. 6.5 కోట్ల ఏండ్ల కిందటివని అంచనా

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా రాజం పేట మండలం బసన్నపల్లి శివారులోని బసవేశ్వరుని గుట్టకు దక్షిణం వైపు లావా పొరల నడుమ నత్తగుల్ల శిలాజాలు ఉన్నట్లు గుర్తించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరర్, కొత్త తెలంగాణ చరిత్ర టీమ్​ మెంబర్ ​డాక్టర్​ వి. శంకర్, ప్రిన్సిపాల్​ కె.విజయ్​కుమార్, భూగర్భ జల జిల్లా ఆఫీసర్​సతీశ్​యాదవ్​, ఫారెస్ట్​ రేంజ్​ఆఫీసర్ ​రమేశ్​మాట్లాడుతూ దక్కన్​ ద్వీపకల్పంలో విస్పోటనంతో ఏర్పడ్డ లావా పొరల మధ్య ఈ ఇన్​ఫ్రా ట్రాఫియన్​ చెర్ట్​ అవక్షేపాలు ఉన్నాయన్నారు. 6.5 కోట్ల ఏండ్ల క్రితం ఏర్పడి ఉంటాయన్నారు. కొత్త తెలంగాణ చరిత్ర టీమ్ ​కన్వీనర్​శ్రీరామోజు హరగోపాల్, భూగర్బ శాస్ర్తవేత్త, జియోలాజికల్ సర్వే ఆఫ్ ​ఇండియా రిటైర్డ్​డిప్యూటీ డైరెక్టర్​చకిలం వేణుగోపాల్​రావు గ్యాస్ట్రో పోడ్ ​శిలాజాలుగా గుర్తించారని శంకర్ ​తెలిపారు.