వానా కాలంలో నేచురల్ రూమ్‌‌ స్ప్రేలు

వానా కాలంలో నేచురల్ రూమ్‌‌ స్ప్రేలు

వానా కాలంలో ఇంట్లో ఎప్పుడూ అదో రకమైన వాసన వస్తూ ఉంటుంది. అందుకని రకరకాల ఫ్లేవర్లతో ఉండే రూమ్‌‌ స్ప్రే, ఎయిర్ ఫ్రెష్‌‌నర్లు వాడుతుంటారు. వాటివల్ల చెడు వాసన పోయినా, అవి ఎక్కువరోజులు మాత్రం ఉండవు. వాటికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. అందుకని వాటి బదులుగా ఒకసారి కొంటే ఎక్కువ రోజులు వాడుకునే ఎసెన్షియల్ ఆయిల్స్, క్యాండిల్స్‌‌, గడ్డి జాతి మొక్క నుంచి తయారుచేసిన డిఫ్యూజర్స్‌‌, హ్యుమిడిఫైయర్లని వాడొచ్చు. వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కువే ఉంటుంది.

  • మార్కెట్‌‌లో  కావాల్సిన ఫ్లేవర్స్‌‌లో ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి. వాటితో పాటు డిఫ్యూజర్‌‌‌‌ స్టిక్స్‌‌ కొనుక్కోవాలి. కొన్ని నీళ్లల్లో నాలుగైదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్‌‌ కలపాలి. అందులో డిఫ్యూజర్‌‌‌‌ స్టిక్స్‌‌ ముంచి ఉంచితే, అవి చాలారోజుల వరకు మంచి వాసన ఇస్తాయి.  
  • క్యాండిల్ వ్యాక్స్‌‌ని కరిగించాలి. దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్‌‌ కలిపి క్యాండిల్ తయారుచేయాలి. 
  • హ్యుమిడిఫైయర్లలో నీళ్లు పోసి గాలిలో తేమని పెంచుతుంటారు. వాటిలో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్‌‌ కలిపి రూమ్‌‌ ఫ్రెష్‌‌నర్‌‌‌‌లా వాడుకోవచ్చు.
  • వీటిని అరోమా థెరపిగా కూడా వాడొచ్చు. అరోమా థెరపీ అంటే సువాసనలతో వ్యాధులను నయం చేసే పద్ధతి. ఈ పద్ధతిలోవాసనని పీల్చుకోవడం వల్ల మనసుకు రిలాక్స్‌‌గా అనిపిస్తుంది. ఒత్తిడినుంచి బయటపడి, బాగా నిద్ర పడుతుంది.