పూర్తిగా కేసీఆర్ లాగా మారిపోయిన నానిని చూసేయండి

పూర్తిగా కేసీఆర్ లాగా మారిపోయిన నానిని చూసేయండి

నాని (Nani) హీరోగా..శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ హాయ్ నాన్న(Hi Nanna).  నాని 30వ  సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 7 న రిలీజ్కు సిద్దమయ్యింది. ఈ మూవీ రిలీజ్కు టైం దగ్గర పడుతుండటంతో..మేకర్స్ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచేశారు. హాయ్ నాన్న టీంతో స్పెషల్ ఇంటర్వ్యూ స్తో పాటు..కాలేజీ స్టూడెంట్స్ ని మీట్ అవుతూ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చాలానే చేస్తున్నారు. 

ఇక లేటెస్ట్ గా నాని విభిన్నమైన ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు. రాజకీయ నాయకుడిలా..ఒక పార్టీ అధ్యక్షుడిలా..ఓటు కోసం ప్రచార కార్యక్రమాలు చేసే వారధిలా..కనిపిస్తున్నారు. అది కూడా కేసీఆర్ రాహుల్ కాంబినేషన్ ప్రెస్ మీట్ డైలాగ్స్ ను ఆధారంగా చేసుకొని నాని అదిరిపోయే డైలాగ్ డెలివరీ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు.

హాయ్ నాన్న పార్టీ పేరుతో ఫన్నీ గా సినిమా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. . కేసీఆర్ ప్రెస్ మీట్లో రిపోర్టర్లతో ఎలా మాట్లాడుతారు.. ? ఎలా పంచ్లు వేస్తారు? అవన్నీ అచ్చు గుద్దినట్లు నాని ఇమిటేట్ చేశాడు. అక్కడ కేసీఆర్ ప్రజల గురించి మాట్లాడితే .. ఇక్కడ నాని తన హాయ్ నాన్న సినిమా గురించి మాట్లాడాడు. 

ఇక కేసీఆర్ మీటింగ్ అంటే..ఏదో ఒక స్పెషల్ కామెంట్ కానీ, సెటైర్ గానీ హైలెట్ అవుతూనే ఉంటుంది. గతంలో విలేఖరి రాహుల్ కు ఇచ్చిన సమాధానాలు అలాగే పంచ్ డైలాగ్స్ కూడా బాగా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియోలు..మీమ్స్ సోషల్ మీడియాలో ఇప్పటికీ తెగ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

ఇక ఇప్పుడు నాని వాటిని ఆధారంగా చేసుకుని హాయ్ నాన్న ప్రమోషన్స్ కానిచ్చేస్తున్నారు. కేసీఆర్ టైమింగ్ తో ఇమిటెడ్ చేస్తూ సినిమాకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ కు తెలియజేయడం ఆసక్తిగా ఉంది. ఈ సినిమా రిలీజ్ పడే అవకాశం లేదు.. ఇదొక ప్యూర్ ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్..ఈ సినిమాలో యాక్షన్ ఎలా ఉంటుంది రాహుల్..గమ్మతిగా అడుగుతావ్..అంటూ తనదైన శైలిలో కామెడీగా క్లారిటీ ఇచ్చాడు నాని.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.