
నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఇయర్ దసరా(Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ఇటీవలే హాయ్ నాన్న(Hi Nanna) లాంటి సాఫ్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో అదే లెవల్లో కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ.
ఇక హాయ్ నాన్న రిజల్ట్ తెలిసిపోవడంతో తన తరువాతి సినిమాపై ఫోకస్ పెట్టారు నాని. ఈనేపథ్యంలోనే నాని తరువాత సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. నాని తరువాతి సినిమా కోసం తమిళ స్టార్ డైరెక్టర్ తో జతకట్టనున్నారట. ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు.. కార్తీక్ సుబ్బరాజు. ఇటీవలే ఈ దర్శకుడు జిగర్ తండా2 తో భారీ విజయాన్ని అందుకున్నాడు. తెలుగు లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇక ఇటీవలే కార్తీక్ సుబ్బరాజు నానిని కలిసి ఒక లైన్ ను వినిపించాడట. ఆ లైన్ నానికి బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కథ చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాణ సంస్థపై తెరకెక్కనున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో భారీ గా రానుందట. ఈ విషయం తెలియడంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.