విడిపోయాక మళ్ళీ పెళ్ళెందుకు? నవదీప్కు కొత్త డౌట్ వచ్చింది!

విడిపోయాక మళ్ళీ పెళ్ళెందుకు? నవదీప్కు కొత్త డౌట్ వచ్చింది!

నటుడు నవదీప్(Navdeep) కొత్త డౌట్ క్రియేట్ చేశారు? విడాకులు తీసుకున్నవాళ్ళు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? అంటున్నారు. అయితే.. ఈ ప్రశ్న తనది కాదట. తన అమ్మగారిదట. ఈ ప్రశ్న అడుగుతూ.. ఓ వీడియోను షేర్ చేశారు నవదీప్. ఈ వీడియో చూసిన  నెటిజన్స్ అసలు నీ డౌట్ ఏంటన్నా? పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యావా ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. హీరో నవదీప్ ప్రస్తుతం తన బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి మాట ఎత్తితే చాలు ఆమడ దూరం పరిగెడతారు. నో పెళ్లి అని డైరెక్ట్ గా కామెంట్స్ చేసేస్తారు. ఇదే విషయాన్ని నవదీప్ అమ్మగారు కూడా చాలాసార్లే అడిగారట. ఆమెకు కూడా అదే సమాధానం చెప్పేశాడట నవదీప్. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

అయితే ఇటీవల నవదీప్ అమ్మగారు ఒక ప్రశ్న వేశారట. అదేంటంటే.. నిజంగా పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే, విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని. అదే ప్రశ్నని వీడియోలో వేస్తూ .. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదన్నారు నవదీప్. అంతేకాదు.. ఆ వీడియోకి జరగాలి పెళ్లి అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏంటన్నా.. పెళ్ళికి రెడీ అవుతున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నవదీప్ నిజంగా పెళ్లికి రెడీ అవుతున్నారా? దానికి హింట్ గానే ఈ వీడియో చేశారా? అనేది తెలియాల్సి ఉంది.