
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు చిత్రాల తర్వాత నవీన్ పొలిశెట్టి నుంచి వచ్చిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. అనుష్కతో కలిసి అతను నటించిన ఈ మూవీకి విడుదలైన మూడో వారంలోనూ స్టడీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ‘రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు అదే డేట్‌కి షారుఖ్ ఖాన్ ‘జవాన్’ వస్తుందని తెలిసి మాకు టెన్షన్ మొదలైంది. కానీ ప్రేక్షకులు మా సినిమాను సూపర్ హిట్ చేశారు. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్‌తోనే అందరికీ రీచ్ అయ్యేలా చేశారు.
యూఎస్, డల్లాస్‌లో ప్రీమియర్స్ వేసినప్పటి నుంచే స్ట్రాంగ్‌గా రన్ స్టార్ట్ అయ్యింది. మూడు రోజులకే వన్ మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వీక్‌లో కూడా యూఎస్ లో రన్ అవుతోంది. స్క్రీన్స్ పెంచుతున్నారు. వాస్తవంగా మూడో వారంలో యూఎస్‌లో సినిమా ఉండదు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఆడియెన్స్ డిమాండ్ మేరకు షోస్ పెంచుతున్నారు. మేము చేసిన మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా.
ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చిరంజీవి గారు మొదలు మహేష్ బాబు, రవితేజ, రాజమౌళి, చరణ్, సమంత.. ఇంకా చాలా మంది నా పర్‌ఫార్మెన్స్ గురించి చెప్పడం హ్యాపీ. ఈ చిత్రంతో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నా. అన్ని జానర్ మూవీస్ చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా’ అని చెప్పాడు.