తేజ్ యాక్సిడెంట్తో లైఫ్ తెలిసొచ్చింది..వెంటనే బైక్స్ అమ్మేశాను

తేజ్ యాక్సిడెంట్తో లైఫ్ తెలిసొచ్చింది..వెంటనే బైక్స్ అమ్మేశాను

యాక్టర్, డైరెక్టర్ నవీన్ విజయ్ కృష్ణ(Naveen Vijay Krishna)  ది సోల్ అఫ్ సత్య(The Soul Of Satya)..అంటూ స్పెషల్ సాంగ్ ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ లో హీరో సాయి ధరమ్(Sai Dharam Tej), హీరోయిన్ కలర్స్ స్వాతి(Colors Swathi) నటించారు.లేటెస్ట్ గా ఈ సాంగ్ సక్సెస్ మీట్ లో సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌ గురించి నవీన్ విజయ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 

సాయి ధరమ్‌ తేజ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన నవీన్‌ విజయ్ కృష్ణ మాట్లాడుతూ..నన్ను డ్రాప్ చేసి వెళ్లిన తర్వాత, యాక్సిడెంట్ అయిందని తెలిసిన వెంటనే షాక్కు గురయ్యాను. అప్పుడే లైఫ్ అంటే మీనింగ్ తెలిసింది. ఆ క్షణమే డిసైడ్ అయ్యి నా దగ్గర ఉన్న బైక్స్ అన్నీ అమ్మేశాను. తేజ్కు జరిగిన యాక్సిడెంట్ చాలా చిన్నదని అనుకున్న, హాస్పటల్ వెళ్లి చూసాకే చూసి తట్టుకోలేకపోయా.. తేజ్ యాక్సిడెంట్‌ నాకో పెద్ద లెసన్ నేర్పింది..అంటూ నవీన్ పేర్కోన్నారు. అలాగే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా బైక్ రైడ్ చేయాలనీ నవీన్ సూచించారు. 

డైరెక్టర్ నవీన్ విజయ్ కృష్ణ యాక్టర్ గా నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు,రెండు జెల్ల సీత మూవీస్ లో నటించారు. హీరోగా గుర్తింపు రాకపోవడంతో..డైరెక్టర్ గా మూవీస్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ది సోల్ అఫ్ సత్య అనే షార్ట్‌ ఫిల్మ్‌ ను డైరెక్ట్ చేసిన విజయ్ ఇండస్ట్రీ నుంచి ప్రశంశలు అందుకున్నారు. 

ఒక సైనికుడి భార్య అంతర్మథనాన్ని సోల్ ఆఫ్ సత్య సాంగ్ లో నవీన్ బాగా చూపించారు. ఆమె పడే ఆవేదన,ఆమె సంతోషం,ఆమె ఆనందం హార్ట్ టచ్ గా ఉంది. ఈ సాంగ్ లో ప్రేమ యొక్క త్యాగం, దేశం కోసం ప్రయాణం..నలిగే పోయే సైనిక జీవితాన్ని చాలా గొప్పగా చూపించారు డైరెక్టర్ విజయ్ కృష్ణ.