నవరాత్రుల్లో చేయాల్సిన, చేయకూడని పనులివే

నవరాత్రుల్లో చేయాల్సిన, చేయకూడని పనులివే

హిందూ మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రి పండుగ సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది.  ఇది తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలతో పూజిస్తారు. శారదీయ నవరాత్రులుగా పిలువబడే ఈ రెండవ నవరాత్రులు ఈ సంవత్సరం అక్టోబర్ 15న ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమయంలో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని పురాణాలు, ఇతర శాస్త్రాలు చెబుతున్నాయి.

మాంసాహారం

నవరాత్రి సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ తొమ్మిది రోజులలో ఎలాంటి మాంసం తినడం తీసుకోరాదు.

వెల్లుల్లి, ఉల్లిపాయలను నివారించాలి

నవరాత్రులలో దుర్గాదేవికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ కాలంలో పొరపాటున కూడా ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి వాడకూడదు.

జుట్టు లేదా గోర్లు కత్తిరించరాదు

నవరాత్రులలో తరచుగా ప్రజలు తమ గోళ్లను, జుట్టును కత్తిరించుకుంటుంటారు. కానీ అలా చేయడం సరికాదు. హిందూ మతం ప్రకారం.. ఉపవాస సమయంలో జుట్టు గానీ, గోర్లు కత్తిరించడం గానీ చేయడ అశుభం. అందువల్ల దీన్ని నివారించాలని పలువురు సూచిస్తున్నారు.
ప్రకటన

మద్యం, పొగాకు

మద్యపానం, పొగాకు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఈ నవరాత్రుల తొమ్మిది రోజులలోనూ దీన్ని పూర్తిగా మానుకోవాలి

ఆహారాన్ని వృథా చేయరాదు

మామూలు రోజుల్లో కూడా ఆహారం వృథా చేయడం పాపం. ఇది చాలా అవమానకరమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల, నవరాత్రుల సమయంలో దీన్ని ఖచ్చితంగా నివారించాలి. ఈ సమయంలో సహనంతో మెలగాలి.

తప్పుడు మాటలు

నవరాత్రులు ప్రార్థన, భక్తికి పవిత్ర కాలం. ఈ సమయంలో అసహ్యకరమైన లేదా ప్రతికూల మాటలు ఉపయోగించడాన్ని పూర్తిగా మానుకోవాలి.

అపవిత్ర కార్యకలాపాలకు పాల్పడరాదు

నవరాత్రులు ఆధ్యాత్మిక అభివృద్ధికి, నైతిక చింతనకు ముఖ్య సమయం. కావున అపవిత్రమైన, హానికరమైన ప్రవర్తన మీ మనస్సులోకి కూడా రాకూడదు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.

స్త్రీలను అగౌరవపరచకూడదు

నవరాత్రుల తొమ్మిది రోజులలో, దుర్గా దేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. స్త్రీ శక్తి, ధైర్యాన్ని సూచించే పండుగ సమయంలో బెదిరింపులు, ఎవరినీ అగౌరవపరచకుండా ఉండడం చాలా ముఖ్యం.  నవరాత్రులలో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లోనూ స్త్రీపై ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడకూడదు.

గాసిప్స్ మానుకోవాలి

నవరాత్రి సమయంలో, ఆహారం, పరిసరాల స్వచ్ఛత మాత్రమే కాదు, మనస్సు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ సమయంలో ఇతరుల గురించి ప్రతికూల విషయాలు మాట్లాడటం, ఆలోచించడం, గాసిప్ చేయడం మానుకోవాలి.

ఆచారాలు, ప్రార్థనలను నిర్లక్ష్యం చేయకూడదు

నవరాత్రి ధ్యానం, ఆచారాలను ప్రోత్సహిస్తుంది. ఈ అభ్యాసాలను విస్మరించడం లేదా వాటి ప్రాముఖ్యత పట్ల ఉదాసీనంగా ఉండటం అగౌరవంగా పరిగణించబడుతుంది. కావున దీన్ని నివారించాలి.

ALSO READ : నెమలి వాహనంపై ఉత్సవమూర్తుల ఊరేగింపు
 

దాన ధర్మాన్ని విస్మరించకూడదు

నవరాత్రులు దాతృత్వానికి సంబంధించిన సమయం. ఇది ప్రేమ, సద్భావనను వ్యాప్తి చేస్తుంది.

అఖండ జ్యోతి ఎప్పుడూ వెలిగేలా చూసుకోవాలి

అఖండ జ్యోతి దైవిక శక్తి ఉనికిని సూచిస్తుంది. అది నిరంతరం వెలిగి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి.