నెమలి వాహనంపై ఉత్సవమూర్తుల ఊరేగింపు

నెమలి వాహనంపై  ఉత్సవమూర్తుల ఊరేగింపు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో రెండో రోజు శ్రీరాజ రాజేశ్వరీ దేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు ఉదయం అమ్మవారికి మహాభిషేకం, శ్రీ లలితా సహస్రనామ సహిత చతుష్టోపచార పూజ, కన్యకాసువాసిని పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిని నెమలి వాహనంపై ఊరేగించారు.

ALSO READ : నవరాత్రుల్లో చేయాల్సిన, చేయకూడని పనులివే