ఇవాళ్టి (అక్టోబర్15)నుంచి తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ఇవాళ్టి (అక్టోబర్15)నుంచి  తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో ఇవాళ్టి (అక్టోబర్15)నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమమయ్యాయి. మూడేళ్లకోసారి వచ్చే అధికమాసం సందర్భంగా కన్యామాసం (భాధ్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో( ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రుల సందర్భంగా ధ్వజారోహణం, ధ్వజావరోహణం రద్దు చేస్తారు. ప్రధానం అక్టోబర్ 19న గరుఢ వాహన సేవ, 20న పుష్పక విమానం సేవ, అక్టోబర్ 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు.

మొదటి రోజు బంగారు తిరుచ్చి ఉత్సవం 

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీదేవి,భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. 

బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున.. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం టోకెన్ల, లడ్డూ, ప్రసాదం వితరణ, సౌకర్యాలకు సంబంధించి అన్ని ఏర్పాటు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.