
హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడురులోని మూసి–కాగ్న నదుల పరివాహక ప్రాంతంలోని దామగుండం ఫారెస్టులో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
వికారాబాద్ అడవుల్లో దాదాపు 2,900 ఎకరాల్లో నేవీ రాడర్ కేంద్రం కోసం దాదాపు 12 లక్షల ఔషధ మొక్కలు, భారీ వృక్షాలను కూల్చేస్తున్నారని, 11 రాష్ట్రాలు రాడర్ కేంద్ర ఏర్పాటును వ్యతిరేకించాయని ఒక ప్రకటనలో తెలిపారు. 2010 నుంచి నేవీ కేంద్రానికి పర్యావరణ అనుమతులు లేకుండా పెండింగ్లో పెట్టారని, ఇప్పుడు దానికి అనుమతులు ఇచ్చి పనులు చేపట్టడం వల్ల జీవరాసులకు ఆక్సీజన్ కొరత ఏర్పడుతుందన్నారు.