నక్సల్స్ దాడిలో ఇద్దరు CRPF జవాన్లు మృతి

నక్సల్స్ దాడిలో ఇద్దరు CRPF జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సుకం జిల్లాలోని సిల్గర్, టేకులగూడెం గ్రామాల మధ్య నక్సలైట్లు ఐఈడీని అమర్చినట్లు పోలీసులు తెలిపారు. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కోబ్రా 201 బెటాలియన్‌కు చెందిన సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు ఓపెనింగ్ పార్టీలో భాగంగా సిల్గర్‌ నుంచి టేకులగూడెం క్యాంపుకు పెట్రోలింగ్ చేస్తున్నారు. ట్రక్కు, బైక్‌లపై వెళుతుండగా IED పేలుడు పదార్థాలతో మావోయిస్టులు ట్రక్కు పేల్చివేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శైలేంద్ర (29), డ్రైవర్ విష్ణు ఆర్ (35) చనిపోయారు. బ్లాస్ట్ తో అప్రమత్తం అయిన బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.