
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు లీడర్లు హతం అయ్యారు. బస్తర్ఐజీ సుందర్రాజ్పి, కాంకేర్ఎస్పీ శలభ్సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. కాంకేర్ జిల్లా సిక్సోడ్పీఎస్పరిధిలోని మోటాబోదేలీ కడ్మే అడవుల్లో మావోయిస్టు పరతాప్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి దర్శన్పడ్డా తిరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఎస్పీ శలభ్సిన్హా.. డీఆర్ జీ, బీఎస్ఎఫ్ తో కలిపి ఒక టీంను ఏర్పాటు చేశారు. బలగాలు ఆదివారం రాత్రి మోటాబోదేలీ అడవుల్లోకి వెళ్లగా సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మావోయిస్టులు వారిపై కాల్పులకు తెగబడ్డారు.
దాదాపు గంట సేపు హోరాహోరీగా కాల్పులు కొనసాగగా మావోయిస్టులు సమీప అడవుల్లోకి పారిపోయారు. ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఒకరు పరతాప్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి దర్శన్పడ్డా, స్మాల్యాక్షన్టీం కమాండర్జాగేశ్సలాంగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు కొన్నాళ్లుగా బస్తర్ దండకారణ్యంలో పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దర్శన్పడ్డాపై చార్గావ్ ఉపసర్పంచ్ హత్య, అక్కడి మైన్లో వాహనాలను దహనం చేసిన ఘటనతోపాటు 40కి పైగా కేసులు ఉన్నాయి. 315గన్, 8ఎంఎం పిస్టల్, బుల్లెట్లు, మందుపాతరలు దొరికాయి.