
ఇండస్ట్రీకొచ్చి ఇరవయ్యేళ్లు అవుతున్నా ఇప్పటికీ సౌతిండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా కొనసాగుతోంది నయనతార. ఇప్పుడు నార్త్‌లోనూ అడుగు పెడుతోంది. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లయన్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. తన పాత్రకి సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ రివీల్ అయ్యింది. షారుఖ్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కనిపించనుంది. తన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. హీరోతో సమానమైన క్యారెక్టర్ అని చెబుతున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్‌ని ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మొదలుపెట్టనున్నారు. రీసెంట్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో తన పార్ట్ షూట్‌ను పూర్తి చేసిన నయన్.. ‘లయన్’ నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ కానుంది. ఇక ఆమె నటించిన ‘కాత్తువాకుల రెండు కాదల్’ ఏప్రిల్ 28న రిలీజవుతోంది. మలయాళంలో ‘గోల్డ్’, తమిళంలో ‘కనెక్ట్’ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.