నయన్, విఘ్నేష్ కు పెళ్లై ఆరేళ్లైందట..

నయన్, విఘ్నేష్ కు పెళ్లై ఆరేళ్లైందట..

గత కొన్ని రోజులుగా అటు టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ నయన్ సరోగసీ వివాదం హట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా ఆ దంపతులు రియాక్ట్ అయ్యారు. నయన్,- విఘ్నేష్ ల వివాహం జూన్ లో వివాహం చేసుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ వారికి ఆరేళ్ల క్రితమే పెళ్లయిందట. ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా వెళ్లడించారు. అప్పట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట తమ వివాహ పత్రాన్ని దాఖలు చేశారు. ఇక అద్దె గర్భం మోసిన మహిళ నయన్ కు బంధువని, ఆమెకు ఆల్రెడీ పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ లో ఒక హాస్పిటల్ లో ఈ ప్రాసెస్ జరిగినట్లు చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే.. సరోగసీ అధికారికంగా అప్రూవ్ కావాలంటే కావల్సినన్ని అర్హతలన్నీ ఉన్నాయని ఈ స్టార్ జంట ఆధారాలతో సహా నిరూపించింది. 

ఇటీవలే ఇద్దరు కవలలకు తల్లిదండ్రులైన నయన్ , విఘ్నేష్ లు సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని పంచుకున్నారు. దీంతో వీరిపై నెటిజన్లు పలు ప్రశ్నలు వేస్తున్నారు. సరోగసీని కేంద్రం నిషేధించింది. అలాంటిది వారు ఆ పద్దతిలో పిల్లల్ని ఎలా కంటారని తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే దానికి సంబంధించిన వివరణను సమర్పించాల్సిందిగా కోరింది. అనంతరం దీనిపై చిత్రపరిశ్రమతో పాటు, అభిమానుల్లోనూ పలు చర్చలు సాగాయి. ఆ దంపతులకు జైలు శిక్ష కూడా పడుతుందనే వార్తలూ వినిపించాయి. సమయం వచ్చినపుడు నిజానిజాలన్నీ బయటికి వస్తాయని, అప్పటివరకూ వెయిట్ చేయమని విఘ్నేష్ ఇటీవలే చెప్పాడు.

సరోగసీ ఎప్పుడు అధికారికం అవుతుందంటే..

సరోగసీ కోరుకొనే జంటకు పెళ్లై ఆరేళ్ళు కావాలి.. అద్దె గర్భం ఇచ్చే మహిళకు ఇదివరకే సొంత బిడ్డ ఉండి ఉండాలి.. ఆ మహిళ.. సరోగసీ కోరుకొనే జంటకు బంధువు అయ్యి ఉండాలి.. అన్నింటికి మించి ఆమె ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండకూడదు.