OTTలోకి వివాదాస్పద మూవీ.. నయనతార సినిమాకు ఎందుకిలా?

OTTలోకి వివాదాస్పద మూవీ.. నయనతార సినిమాకు ఎందుకిలా?

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ అన్నపూరణి(Annapoorani). తమిళ హీరో జై(Jai), సత్యరాజ్(Sathyaraj) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను నీలేష్ కృష్ణ(Neelesh Krishna) తెరకెక్కించారు. పలు వివాదాల నడుమ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమాకుక్ ఆడియన్స్ నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. అంతేకాదు.. చెన్నై వరదలు కూడా ఈ సినిమా పరాజయానికి కారణమయ్యాయి.

దీంతో నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 29 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. దీంతో నయన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పలు కారణాల సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయామని, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అసలు వివాదం ఏంటి?
అన్నపూరణి సినిమాపై తెలెత్తిన వివాదం ఏంటంటే? కథ రీత్యా నయనతార ఈ సినిమాలో బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపించారు కానీ.. ఆమెకుక్ ఇండియాలోనే బెస్ట్ చెఫ్ అవ్వాలనే కోరిక ఉంటుంది. దాని కోసం చాలా కష్టాలు పడుతుంది. చెఫ్ అవ్వడం వల్ల ఆమె నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇదే వివాదానికి దారితీసింది. బ్రాహ్మణా అమ్మాయి మాంసాన్ని ముట్టుకోవడం, వండటం పట్ల పలు బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాను నిలిపివేలంటూ ఆందోళన చేశాయి.