బ్రాహ్మణ అమ్మాయి మాంసం వండటం..ఇష్టపడటమా..: అన్నపూరణి డిలీట్

బ్రాహ్మణ అమ్మాయి మాంసం వండటం..ఇష్టపడటమా..: అన్నపూరణి డిలీట్

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ అన్నపూరణి(Annapoorani). తమిళ హీరో జై(Jai), సత్యరాజ్(Sathyaraj) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను నీలేష్ కృష్ణ (Neelesh Krishna) తెరకెక్కించారు. పలు వివాదాల నడుమ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి..ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగానే..పూర్తిగా డిలీట్ చేసింది. 

అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే.. 

నయనతార కొత్త మూవీ అన్నపూరణి.. కొన్ని రోజులుగా వివాదం అవుతుంది. ఎందుకో తెలుసా.. ఈ సినిమాలోని డైలాగ్స్.. ఇందులో నటించిన నయనతారపై విమర్శలు రావటమే కాకుండా.. కొన్ని సీన్స్ విషయంలో వచ్చిన అభ్యంతరాలతో.. అన్నపూరణి సినిమాను స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్ దాన్ని తొలగించింది. ఇంతకీ సినిమాలో ఉన్న అభ్యంతరకర డైలాగ్స్ ఏంటో తెలుసా..

శ్రీ రాముడు మాంసం తినే వాడంటా.. ఇది హిందూవుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది అంటూ విశ్వహిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంప్లయింట్ చేసింది. 14 ఏళ్లు అటవిలో.. వనవాసం చేసిన రాముడు మాంసం తినేవారని ఈ సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి.. బ్రాహ్మణ అమ్మాయి మాంసం వండటం.. ఇష్టపడటం వంటి డైలాగ్స్ ఉన్నాయి.. అయ్యోరామా.. బ్రాహ్మణ అమ్మాయి మాంసం వండటం ఏంటీ.. తినటం ఏంటీ అనే డైలాగ్స్ పైనా హిందూవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు..

ప్రస్తుతం అన్నపూరణి స్ట్రీమింగ్ ఎక్కడంటే:

నెట్‌ఫ్లిక్స్ నుంచి డిలీట్ అయిన అన్నపూరణి మూవీ లేటెస్ట్గా మరో కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ను వెతుక్కుంది. సాత్ ఇండియ‌న్ మూవీస్ అయిన  ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ సింప్లీ సౌత్‌ (Simply South)లో ఈ సినిమా ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విష‌యాన్ని అన్నపూరణి మేక‌ర్స్ అండ్  సింప్లీ సౌత్‌ ఓటీటీ సంస్థ సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్ర‌క‌టించారు.