బాస్తో మరోసారి నయనతార.. నాగ్ వందో సినిమా టైటిల్ ఇదే !

బాస్తో మరోసారి నయనతార.. నాగ్ వందో సినిమా టైటిల్ ఇదే !

కొంత గ్యాప్‌‌ తర్వాత చిరంజీవి సినిమాతో హీరోయిన్‌‌గా రీఎంట్రీ ఇస్తోంది నయనతార. ‘మన శంకరవర ప్రసాద్‌‌గారు’ పేరుతో అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్‌‌కు హ్యూజ్‌‌ రెస్పాన్స్‌‌ వస్తోంది. చిరంజీవి డ్యాన్స్‌‌ గ్రేస్‌‌తో పాటు నయనతార గ్లామర్‌‌‌‌ సాంగ్‌‌కు స్పెషల్‌‌ అట్రాక్షన్‌‌గా నిలిచాయి.  ఇక ఈ సినిమా రిలీజ్‌‌కు ముందే తెలుగులో నయన్‌‌ మరో సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు రా కార్తిక్‌‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నాగ్ కెరీర్‌‌‌‌లో ఇది 100వ చిత్రం. ‘లాటరీ కింగ్‌‌’ అనే టైటిల్‌‌ ప్రచారంలో ఉంది. ఇందులో నాగార్జునకు జంటగా టబు నటించబోతోందని వార్తలు వచ్చాయి. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌‌ తిరిగి సెట్‌‌ అవుతుండడంతో ఫ్యాన్స్‌‌ హ్యాపీ ఫీలయ్యారు.  

కానీ ఆరోగ్య కారణాలతో టబు ఈ సినిమాకు దూరమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ  స్థానంలో నయనతారను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. గతంలో నాగార్జునకు జంటగా ‘బాస్‌‌’ అనే చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. సినిమా రిజల్ట్‌‌ మాటెలా ఉన్నా నాగ్, నయన్‌‌ కాంబో ఆకట్టుకుంది.  మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్‌‌ సెట్‌‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.