
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara) తొలిసారి బాలీవుడ్ స్క్రీన్‌పై మెరవనుంది. ఏకంగా షారుక్ ఖాన్(Shah rukh khan)తో జవాన్(Jawan) సినిమాతో ఆమె బాలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. నయనతార తన సినమా ప్రమోషన్స్‌లో పాల్గొనదు. కోలీవుడ్‌లో ఎంతో కాలంగా ఆమె ఇదే రూల్‌ను ఫాలో అవుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నయన్ పట్టించుకోదు. ముందే ప్రమోషన్స్ బాధ్యత తాను తీసుకోనని చెప్పేస్తుందట.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు బాలీవుడ్ సినిమాకి కూడా నయన్ ఇదే రూల్‌ను ఫాలో అయ్యేట్టు కనిపిస్తోంది. జవాన్‌లో దీపికా పదుకునే(Deepika padukone) ఓ చిన్న రోల్లో కనిపించనుంది. అయితే, ప్రమోషన్స్‌లో దీపికా పాల్గొంటుంది కానీ, హీరోయిన్ అయిన నయన్ మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. ఇక ఇటీవల హీరో విశాల్(Vishal) సైతం నయన తార వైఖరిపై స్పందించాడు. ప్రమోషన్స్‌లో పాల్గొనడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం అని తెలిపాడు.