నీట్ పీజీ నోటిఫికేష‌‌న్ విడుద‌‌ల

నీట్ పీజీ నోటిఫికేష‌‌న్ విడుద‌‌ల

నేషనల్‌‌ బోర్డ్‌‌ ఆఫ్‌‌ ఎగ్జామినేషన్స్‌‌ ఇన్‌‌ మెడికల్‌‌ సైన్సెస్‌‌ (ఎన్‌‌బీఈఎంఎస్‌‌) 2023 సంవత్సరానికి నేష‌‌న‌‌ల్ ఎలిజిబిలిటీ క‌‌మ్ ఎంట్రన్స్‌‌ టెస్ట్ (నీట్) పోస్టు గ్రాడ్యుయేష‌‌న్(పీజీ) నోటిఫికేష‌‌న్ విడుద‌‌ల చేసింది. దీని ద్వారా ఎండీ/ ఎంఎస్‌‌/ పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్​ కల్పిస్తారు.

అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ/ ప్రొవిజ‌‌న‌‌ల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. ఏడాది ఇంట‌‌ర్న్‌‌షిప్ పూర్తి చేసి ఉండాలి. క‌‌ంప్యూట‌‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  అప్లికేషన్​ ఫీజు రూ.4250. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.3250 చెల్లించాలి. పరీక్ష మార్చి 5న నిర్వహిస్తారు. వివరాలకు www.natboard.edu.in వెబ్​సైట్ చూడాలి