ఎన్బీకే 111 క్రేజీ అప్ డేట్..

ఎన్బీకే 111 క్రేజీ అప్ డేట్..

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ  అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు మేకర్స్. సెప్టెంబర్ 6న మూవీ టైటిల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా  ప్రకటిస్తామన్నారు.  

ముంబై మాఫియా నేపథ్యంలో గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణను స్టైలిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.  కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా,   మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

‘వీర సింహారెడ్డి’ తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 111వ చిత్రం.  క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.