కరీంనగర్ ‘వివేకానంద’ కళాశాలలో ఎన్ సీసీ సెలబ్రేషన్స్

కరీంనగర్  ‘వివేకానంద’ కళాశాలలో  ఎన్ సీసీ సెలబ్రేషన్స్

కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని వివేకానంద  డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం ఎన్ సీసీ సెలబ్రేషన్స్​ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్ సీసీ ద్వారా  కేడెట్లలో దేశభక్తితోపాటు సేవానిరతి, అంకితభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.  

జీవితంలో  ఉన్నత  శిఖరాలను  అధిరోహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కేడెట్ల డ్యాన్స్​లు అలరించాయి. కెప్టెన్ కిరణ్ జ్యోతి, ఏసీవో సంపత్ కుమార్, ఏవో శ్రవణ్ కుమార్, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.