శరద్ పవార్ సంచలన నిర్ణయం

శరద్ పవార్ సంచలన నిర్ణయం

ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన అన్ని విభాగాలు, సెల్స్‌ రద్దు చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌  ట్వీట్ చేశారు. అయితే నేషనలిస్ట్ ఉమెన్స్ కాంగ్రెస్, నేషనలిస్ట్‌ యూత్‌ కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ స్టూడెంట్స్‌ కాంగ్రెస్‌ విభాగాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇంత హఠాత్తుగా రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న అంశంపై మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. 

అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే శివసేనలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో మూడు వారాల క్రితం ప్రభుత్వం కుప్పకూలింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ పరిణామాలు జరిగిన రోజుల వ్యవధిలోనే శరద్ పవార్ అన్ని విభాగాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.