శరద్​​ పవర్ పార్టీ పేరు.. ఎన్సీపీ శరద్‌‌‌‌‌‌‌‌ చంద్ర పవార్

శరద్​​ పవర్ పార్టీ పేరు.. ఎన్సీపీ శరద్‌‌‌‌‌‌‌‌ చంద్ర పవార్

న్యూఢిల్లీ: సీనియర్ నేత శరద్​​పవార్ వర్గం పార్టీకి ‘‘నేషనలిస్ట్ కాంగ్రెస్ ​పార్టీ శరద్​చంద్ర పవార్” పేరును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. పార్టీ గుర్తు ఇంకా కేటాయించలేదు. అజిత్ పవార్ వర్గమే అసలైన ఎన్సీపీ అని, ఎన్నికల గుర్తు(గడియారం), పార్టీ పేరు ఆ వర్గానికే చెందుతాయంటూ తేల్చిచెప్పిన మరుసటి రోజే ఈసీ ఈ నిర్ణయం వెల్లడించింది.

త్వరలో మహారాష్ట్రలోని ఆరు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ‘వన్ టైమ్ ఆప్షన్’ గా ఈ పేరుని శరద్​ పవార్ వర్గం అంగీకరించినట్టు వివరించింది. అలాగే, ఆ పార్టీకి ఉదయించే సూర్యుడు, జత గాజులు, మర్రి చెట్టు సింబల్స్​లో ఒక దాన్ని కేటాయించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీకి కొత్త పేరు సూచించేందుకు శరద్ పవార్‌‌‌‌‌‌‌‌కు వర్గానికి బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఈసీ టైమ్ ఇచ్చింది. అయితే, వారు పేరు సూచించకపోవడంతో తనే కేటాయించింది.