డిప్యూటీ స్పీకర్ పదవీ ఎన్డీయేకే!

డిప్యూటీ స్పీకర్ పదవీ ఎన్డీయేకే!

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్  పదవిని దక్కించుకున్న ఎన్డీయే.. డిప్యూటీ స్పీకర్  పదవిని కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్  పదవిని ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వాలి. కానీ, స్పీకర్  పదవికి ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని నిలబెట్టడంతో.. ఆనవాయితీని ఉల్లంఘించి డిప్యూటీ స్పీకర్  పదవిని కూడా దక్కించుకోవాలని ఎన్డీయే భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో తన మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూను ఎన్డీయే సంతృప్తిపరుస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా అంతకుముందు స్పీకర్ పదవి కోరుకున్నాయి. కానీ, బీజేపీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్  పదవి టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.