ఉత్తరకాశీ టన్నెల్లోకి ప్రవేశించిన రెస్క్యూ టీం..సేఫ్జోన్లో కార్మికులు..!

ఉత్తరకాశీ టన్నెల్లోకి ప్రవేశించిన రెస్క్యూ టీం..సేఫ్జోన్లో కార్మికులు..!

ఉత్తరాఖండ్: ఉత్తరకాశీ టన్నెల్ చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా సక్సెస్ అయినట్లే..ఎట్టకేలకు 21 మంది రెస్క్యూ ఆపరేషన్ సభ్యులు సిల్క్యారా సొరంగంలోకి ప్రవేశించారు. ట్యూబ్ ద్వారా సొరంగం లోపలికి ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను తరలించేందుకు అంబులెన్స్ లు సొరంగం వద్దకు చేరుకున్నాయి. ఆస్పత్రి లో బెడ్లు సిద్ధంగా ఉంచారు. 

కార్మికులను బయటకు తెచ్చేందుకు మార్గం కోసం బోరింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. విజయవంతంగా 45 మీటర్లు లోనికి పైపులను పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శిథిలా అవతలి వైపు చిక్కుకుపోయిన కార్మికులను చేరుకోవడానికి ఇంకా 57 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఇవాళ( నవంబర్ 22) ముందుగా డ్రిల్లింగ్ కు అడ్డుగా ఉన్న కొన్ని మెటల్ రాడ్ ల ను యాంగిల్ కట్టర్ ను లోనికి చొప్పించారు. 

మరోవైపు సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామితో మాట్లాడారు. కార్మికులకు అందిస్తున్న ఆహారం, మందులు ఇతర నిత్యావసరాలపై అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పైపు లైన్ ద్వారా పంపిన ఎండో స్కోపిక్ ఫ్లిక్సీ కెమెరా ద్వారా చిక్కుకున్న కార్మికుల మొదటి విజువల్స్ మంగళవారం చిత్రీకరించారు.