NDRFలో కి మహిళా సిబ్బంది

NDRFలో కి మహిళా సిబ్బంది

కొన్ని ఉద్యోగాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో దూస్కెళ్తున్నారు మహిళలు. ఇందులో భాగంగానే నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (NDRF) లో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించనుంది కేంద్రం. దీనికి సంబంధించి గతేడాది ఒక ప్రతిపాదన చేసింది. మహిళా సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకూ మహిళలను చేర్చుకోలేదు. ప్రస్తుతం వారిని కూడా ఉద్యోగాలలోకి తీసుకోగలిగే స్థితిలో ఉన్నట్లు NDRF డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌ ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు బెటాలియన్లకు కొంతమంది మహిళను పంపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ ఏడాదిలోగా పూర్తవుతుందన్నారు.