రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 100మంది

రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 100మంది

మహారాష్ట్రలోని థానేలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన తర్వాత డ్రగ్స్ సేవిస్తున్నారనే అనుమానంతో దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 31) తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న వారిలో పార్టీని నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కూడా ఉన్నారు.

థానే పోలీసుల క్రైమ్ బ్రాంచ్ యూనిట్ ఈ అర్ధరాత్రి  నిర్వహించిన ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది. ఇది తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమైంది. ఈ దాడిలో, ఈవెంట్ లో మాదకద్రవ్యాల వినియోగాన్ని సూచించే ఎల్‌ఎస్‌డి, గంజాయితో సహా వివిధ చట్టవిరుద్ధ పదార్థాలను అధికారులు కనుగొని, వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలను నిర్ధారించడానికి అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.