నిరుద్యోగ భారతమా..! : 310 ఉద్యోగాలకు.. 2 లక్షల మంది దరఖాస్తు

నిరుద్యోగ భారతమా..! :  310 ఉద్యోగాలకు.. 2 లక్షల మంది దరఖాస్తు

దేశంలో నిరుద్యోగుల  సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చదువుకున్న వారి సంఖ్య  ఎక్కువగా ఉండటంతో  నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతోంది. దీని వల్ల  ఉద్యోగాలు దొరకడం లేదు.   డిగ్రీలు, పీజీలు , బీటెక్ లు  చదివి కూడా  పట్టా చేత పట్టుకుని తిరుగుతున్నారు నిరుద్యోగులు. ఇక  ప్రభుత్వ  ఉద్యోగం గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు.  ఏ చిన్న  ఉద్యోగానికైనా సరే  లక్షలాది మంది అప్లై చేస్తున్నారు. దీనిని బట్టి చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత డిమాండ్  ఉందనేది..  కర్ణాటకలోని  ఫారెస్ట్ డిపార్ట్ మెంట్  లో  310  పోస్టులకు దాదాపు 2 లక్షల మంది అప్లై చేయడమే ఇందుకు చిన్న ఎగ్జాంపుల్.

కర్ణాటక  ఫారెస్ట్ డిపార్ట్ మెంట్  ఖాళీగా ఉన్న 310 అటవి పరిశీలకుల  పోస్టుల కోసం  2022- 23లో లక్షా 94 వేల 7 దరఖాస్తులను స్వీకరించింది. టెన్త్ పాస్ తో పాటు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులను పరిగణలోకి తీసుకుని  దాదాపు   267 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది  ప్రభుత్వం.  సెప్టెంబర్ 3న ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చింది. అయితే  ఈ ఉద్యోగాలు  పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి ఈ సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.

 ఇటీవలే కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ ముందుకొచ్చింది.22 వేల కోట్లతో 40 వేల ఉద్యోగాల లక్ష్యంతో మొబైల్ ఫోన్ అసెంబ్లీ ఫ్లాంట్ ను ఏర్పాటు చేసేందుక ఒప్పుకుంది