ముందుంది అసలు ముప్పు

ముందుంది అసలు ముప్పు
  • లాక్ డౌన్ సడలింపులపై గుడ్డిగా వ్యవహారించొద్దంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

జెనీవా : కరోనా వైరస్ ముప్పంతా ఇంకా ముందుందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. రాబోయే కాలంలోనే మరింత అలర్ట్ గా ఉండాల్సి ఉందని…లేదంటే మళ్లీ కరోనా ప్రభావానికి అంతా బలికాకతప్పదని తెలిపింది. అందుకే ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా వ్యవహారించాలంటూ డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ చీఫ్ మైకేల్ ర్యాన్ సూచించారు. ఆంక్షల సడలింపు విషయంలో గుడ్డిగా ముందుకు వెళ్లవద్దని చెప్పారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా కాలం పాటు లాక్ డౌన్ కొనసాగించిన పలు దేశాలు ఇప్పుడిప్పుడే ఆంక్షలను సడలిస్తున్నాయి. దీనిపై డబ్య్లూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షలు సడలించిన దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. జర్మనీ లాక్ డౌన్ ఎత్తివేశాక కేసులు పెరిగాయని…ఇక సౌత్ కొరియా లో నైట్ క్లబ్ లు కరోవా వ్యాప్తి కేంద్రాలయ్యాయని చెప్పారు. మంచి ఫలితాలు వస్తున్న సమయంలో అంతా చెడగొట్టేలా వ్యవహారించవద్దన్నారు. భవిష్యత్ లో వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్న కూడా గుర్తించలేని పరిస్థితి ఉంటుందని ఇది ప్రపంచానికి సవాల్ గా మారుతుందని హెచ్చరించారు.
హెర్డ్ ఇమ్యూనిటీ ఆశలు సరికావు
కరోనాతో ఫైట్ చేస్తున్న చాలా దేశాలు ఆంక్షల విషయంలో సరిగా వ్యవహారించటం లేదని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్న ఆశతో చాలా దేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయని ఇది ప్రజా ఆరోగ్యానికి మరింత నష్టం చేస్తుందని హెచ్చరించింది. వైరస్ ను నిరంతరం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుందని…అనుకున్న స్థాయిలో యాంటీబాడీలు చాలా మందిలో ఉత్పత్తి కావటం లేదని తెలిపింది. ఆంక్షలను ఓకేసారి కాకుండా దశల వారీగా పరిస్థితులను బట్టి ఎత్తివేయాలని కోరింది.