నీరజ్‌‌‌‌ చోప్రా కొత్త చరిత్ర.. మెన్స్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోలో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌

నీరజ్‌‌‌‌ చోప్రా కొత్త చరిత్ర.. మెన్స్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోలో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ అథ్లెట్, టోక్యో ఒలింపిక్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. మెన్స్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోలో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ను సాధించాడు. వరల్డ్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో నీరజ్‌‌‌‌ 1455 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు.

ఇండియా తరఫున గతంలో ఎవరూ ఈ ర్యాంక్‌‌‌‌ను సాధించలేదు. ఈ నెల 6న దోహాలో జరిగిన డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలవడం చోప్రా ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. గ్రెనెడా అథ్లెట్‌‌‌‌ అండర్సన్‌‌‌‌ పీటర్స్‌‌‌‌ 1433 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్‌‌‌‌కు ఇతనికి మధ్య 22 పాయింట్ల తేడా ఉంది. జాకూబ్‌‌‌‌ వాడ్లెచ్‌‌‌‌ (చెక్‌‌‌‌–1416), జూలియన్‌‌‌‌ వెబెర్‌‌‌‌ (జర్మనీ–1385), అర్షద్‌‌‌‌ నదీమ్‌‌‌‌ (పాకిస్తాన్‌‌‌‌–1306) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో 
కొనసాగుతున్నారు.