భారత రెజ్లర్ల ధర్నాకు నీరజ్ చోప్రా మద్దతు

భారత రెజ్లర్ల ధర్నాకు నీరజ్ చోప్రా మద్దతు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న భారత రెజ్లర్లకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా వంటి రాజకీయ నేతలు, ఇతర క్రీడాకారులు రెజ్లర్ల ఆందోళనకు మద్దతు ప్రకటించగా...తాజాగా భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సైతం మద్దతు తెలిపాడు. రెజ్లర్ల సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్ణయం తీసుకోవాలని ట్విట్లర్ లో కోరాడు. 

బాధగా ఉంది...

దేశ పతాకాన్ని ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన రెజ్లర్లు..న్యాయం కోసం న్యాయం కోసం వీధుల్లో ధ‌ర్నా చేయ‌డం బాధగా ఉందని  నీర‌జ్ అన్నాడు.  దేశానికి గ‌ర్వకార‌ణమైన  అథ్లెట్ల  స‌మ‌గ్రత‌ను..వారి, మ‌ర్యాదను కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరిదన్నాడు. రెజ్లర్ల అంశం కలిచివేసిందని..ఇలాంటిది ఎప్పుడు జరగకూడదన్నాడు. ఈ  సున్నిత‌మైన అంశాన్ని  పార‌దర్శకంగా ప‌రిష్కరించాల‌ని నీర‌జ్ త‌న ట్వీట్‌లో కోరాడు.

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని రెజ్లర్లు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్‌లో ధ‌ర్నా చేస్తున్నారు. బ్రిజ్ భూష‌ణ్ చరణ్  మ‌హిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తున్నారు. వినోశ్ పోగ‌ట్‌, సాక్షీ మాలిక్‌, భ‌జ‌రంగ్ పూనియాతో పాటు అనేక మంది టాప్ రెజ్లర్లు ఈ  నిర‌స‌న చేపట్టారు.  ఇటీవ‌ల అథ్లెట్లకు మ‌ద్దతుగా ఒలింపిక్ మెడ‌లిస్టు అభిన‌వ్ బింద్రా కూడా ట్వీట్ చేశాడు.