మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్1 ఉచిత శిక్షణ : నీరటి రాజేశ్వరి

మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్1 ఉచిత శిక్షణ : నీరటి రాజేశ్వరి

నస్పూర్, వెలుగు: గ్రూప్1మెయిన్స్ క్వాలిఫై అయిన మైనార్టీ అభ్యర్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.

శిక్షణ తరగతులు ఈ నెల 22న ప్రారంభమవుతాయని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల19లోగా దరఖాస్తులు సమర్పించాలని, పూర్తి వివరాలకు 040‌‌_23236112లో లేదా directormscccctelangana@gmail.comలో సంప్రదించవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.