డాక్టర్ అవ్వాలంటే గెట్ రెడీ.. నీట్ అప్లికేషన్ నేటి నుంచే

డాక్టర్ అవ్వాలంటే గెట్ రెడీ.. నీట్ అప్లికేషన్ నేటి నుంచే

దేశవ్యాప్తంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ PG 2024 కోసం వివిధ MD,MS అడ్మిషన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడిసిన్ లో PG డిప్లొమా కోర్సులు చదవడానికి అప్లికేషన్ చేసుకునేందుకు ఈరోజు ( ఏప్రిల్ 16) మధ్యాహ్నం 3 గంటల నుంచి అవకాశం కల్పిస్తున్నారు.

అధికారిక వెబ్‌సైట్ natboard.edu.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2024--25 విద్యాసంవత్సరానికి సంబంధించిన NEET 2024 PGలో ఎంట్రన్స్ కోసం ఈ టెస్ట్ పెడతారు. ఆన్ లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మే 6కాగా.. జూన్ 23న నీట్ పీజీ పరీక్ష ఉంటుంది. జూలై 15న రిజల్ట్స్ విడుదల చేశారు. MBBS డిగ్రీ, తాత్కాలిక MBBS పాస్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు నీట్ కు అప్లై చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు 2024 ఆగస్టు15 లోగా లేదా అంతకు ముందు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు రూ.3500 మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.2500 లు ధరఖాస్తు ఫీజు చెల్లించాలి.