చివరి నిమిషంలో పరీక్ష సిలబస్ ఎలా మారుస్తారు?

చివరి నిమిషంలో పరీక్ష సిలబస్ ఎలా మారుస్తారు?
  • వైద్య విద్యను వ్యాపారమయం చేస్తున్నారా..?
  • జాతీయ పరీక్షల బోర్డుకు సుప్రీంకోర్టు అక్షింతలు

న్యూఢిల్లీ: వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్‌-పీజీ 2021 ప‌రీక్షకు చివరి నిమిషంలో సిలబస్‌ మార్చాలని జాతీయ పరీక్షల బోర్డు నిర్ణయించడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమాత్రం ముందు చూపు లేకుండా హడావుడిగా.. వైద్య విద్యను వ్యాపారమయం చేసే విధంగా నిర్ణక్ష్లు ఉన్నాయంటూ.. జాతీయ ప‌రీక్షల బోర్డు (ఎన్బీటీ)కు సుప్రీంకోర్టు  అక్షింత‌లు వేసింది. ఎంబీబీఎస్ లో చేరిన మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులు పీజీ పై దృష్టి పెట్టి చదువుతారని.. మీరేమో చివరి నిమిషంలో సిలబస్ మార్చుతామంటే ఎలా అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు 2 నెలలు సమయం ఇస్తామని.. దీని కోసం పరీక్షను రెండు నెలల తర్వాత నిర్వహిస్తామంటే ఎలా సరిపోతుందని ఆయన నిలదీశారు. రెండు నెలల తర్వాత కుదరదంటే వచ్చే ఏడాది పరీక్ష నిర్వహిస్తామని ప్రతిపాదించగా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పాత పద్ధతిలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని.. దీనిపై రేపు బుధవారం కూడా విచారణ కొనసాగిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.