
రాజస్థాన్ విద్యార్థి నళిన్‌కు టాప్ ర్యాం క్
56.49 శాతం పాస్.. కటాఫ్ 134 మార్కులు
రాష్ట్రా నికి తగ్గుతున్న ర్యాం కులు
2017 టాప్–50లో ఐదుగురు,
గతేడాది ఇద్దరు, ఈసారి ఒక్కరే
గతేడాది కంటే స్వల్పంగా తగ్గిన ఉత్తీర్ణతా శాతం
ఈసారి టాప్–50లో ఏపీ నుంచి ముగ్గురు..
హైదరాబాద్, వెలుగు: నీట్ ఫలితాల్లో రాష్ట్రానికి చెంది న విద్యార్థిని మాధురిరెడ్డి జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు సాధించింది. అమ్మాయిల విభాగంలో టాపర్ గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. ఈసారి రిజల్ట్స్ లో రాష్ట్రం కొంత వెనుకబడింది. టాప్–50లో రాష్ట్రం నుంచి మాధురిరెడ్డి (695 మార్కులు) ఒక్కరికే చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్–50లో ముగ్గురు నిలిచారు. ఆ రాష్ట్రానికి చెందిన ఖురేషీ ఆస్రాకు 690 మార్కులతో ఆస్రాకు 690 మార్కులతో జాతీయ స్థాయిలో 16వ
ర్యాంకు, మహిళల విభాగంలో 3వ ర్యాంకు వచ్చింది.
పిల్లి భాను శివతేజ 685 మార్కులతో 40వ ర్యాంక్, ఎస్.శ్రీనందన్ రెడ్డి 42వ ర్యాంక్ సాధించారు. రాజస్థాన్ కు చెందిన నళిన్ ఖండేల్‌వాల్ మొత్తం 720 మార్కులకుగాను 701 మార్కు లతో ఆలిండియా టాపర్‌గా నిలిచారు. ఢిల్లీకి చెందిన భవిక్ బన్సల్, ఉత్తరప్రదేశ్ కు చెందిన అక్షత్ కౌశిక్ తర్వా తి స్థానాల్లో నిలిచారు. టాప్ 50లో అత్యధికంగా ఢిల్లీ నుంచి 9 మంది, రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఆరుగురి చొప్పున, హర్యా నా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఏపీ, కేరళ నుంచి ముగ్గురి చొప్పున, జార్ఖండ్ , పంజాబ్, కర్నాటకల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. నీట్ ర్యాంకులతోపాటు ఫైనల్ ఆన్సర్‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసింది.
రాష్ట్రా నికి తగ్గుతున్న ర్యాం కులు..
నీట్లో రాష్ట్రాని కి వరుసగా ర్యాంకులు తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణ 2017లో నీట్లో చేరింది. ఆ
ఏడాది జరిగిన తొలి నీట్పరీక్షలో మనతోపాటు ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఆ ఏడాది టాప్–50లో
తెలంగాణ స్టూడెంట్లకు ఐదు ర్యాంకులు (12, 24, 30, 32, 38), ఏపీ స్టూడెంట్లకు రెండు ర్యాంకులు
(14, 36) వచ్చాయి. అదే టాప్–100లో తెలుగువాళ్లే 23 మంది ఉండగా.. 12 మంది తెలంగాణ,
11 మంది ఏపీకి చెందినవారు. ఇక గతేడాది నీట్టాప్–50లో తెలంగాణ నుంచి ఇద్దరు (2, 25 ర్యాంకులు), ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు (8, 14, 16, 19, 36 ర్యాంకులు) చోటు దక్కించుకున్నా రు. కానీ ఈసారి రాష్ట్రం నుంచి ఒక్కరు, ఏపీ నుంచి ముగ్గురికి మాత్రమే టాప్–50లో స్థానం దక్కింది.
ఈసారి 56.49 శాతం పాస్
ఈసారి దేశవ్యాప్తంగా 14,10,755 మంది నీట్ పరీక్ష రాయగా.. 7,97,042 మంది ( 56.49
శాతం) అర్హత మార్కు లు సాధిం చారు. మరో 1,08,620 మంది పరీక్ష రాయలేదు. గతేడాది
(56.27 శాతం) కంటే ఈసారి పాసైనవారి శాతం స్వల్పంగా పెరిగింది. అత్యధికంగా ఢిల్లీలో 74.92%
మంది పాస్ కాగా.. అతి తక్కువగా నాగాలాండ్‌లో 34.52% మందే అర్హత సాధించారు. తెలంగాణ
నుంచి 48,996 మంది నీట్ రాయగా.. 33,044 (67.44%) మంది పాసయ్యారు. గతేడాది నమోదైన
68.88 శాతం కంటే ఈసారి స్వల్పంగా తగ్గింది. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి 55,200 మంది పరీక్షరా-
యగా 39,039 మంది (70.72 శాతం) పాసయ్యారు. ఈసారి నీట్ పేపర్ ఈజీగా ఉండటంతో గతేడాది
కంటే కటాఫ్ మార్కులు పెరి గాయి. గతేడాది ఓపెన్ కేటగిరీ కటాఫ్ 119 మార్కులుగా ఉండగా, ఈసారి
134కు పెరి గింది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కటాఫ్ గతేడాది 96 ఉండగా.. ఈ ఏడాది 11 మార్కులు పెరిగి 107 మార్కులకు చేరింది.
అమ్మాయిలే ఎక్కువ
నీట్ పాసైన 7,97,042 మందిలో 4,45,761 (57 .11%) మంది అమ్మాయిలు, 3,51,278
(55.73%) మంది అబ్బా యిలు ఉన్నా రు. ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు పరీక్ష రాయగా ముగ్గురు అర్హత
సాధిం చారు. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 84,982 మంది అర్హతపొందగా, అత్యల్పంగా సిక్కిం
నుంచి 348 మంది పాసయ్యారు. వారంలో రాష్ట్రా ల వారీ మెరిట్ లిస్ట్దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను నీట్ జాతీయ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. మిగతా సీట్లను ఆయా రాష్ట్రా ల మెరిట్ లిస్ట్ ఆధారంగా స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రస్తుతం జాతీయ ర్యాంకులను ప్రకటించిన ఎన్ టీఏ, వారం రోజుల్లో రాష్ట్రా లవారీగా
మెరిట్ జాబితాలను వెల్లడించనుంది.