
నీట్యూజీ రీటెస్ట్ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు కొత్త ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు చోటుచేసుకోవడం తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని రద్దు చేసి జూన్ 23వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే గ్రేస్ మార్కుల కారణంగా 720కి 720 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినవారికి.. రీ-టెస్టులో ఆ మార్కులు రాలేదు.
గ్రేస్ మార్కుల కారణంగా.. అప్పట్లో ఆరుగురు టాపర్లుగా నిలిచారు. అయితే ఆ మార్కులను ఉపసంహరించుకోవడంతో టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గిపోయింది. ఆ ఆరుగురిలో ఐదుగురే రీ-టెస్టుకు హాజరయ్యారు. కాగా NEET -UG2024 పరీక్ష మే5 నిర్వహించారు. ఫలితాలు జూన్ 14న విడుదల చేయాల్సి ఉండగా. షెడ్యూల్ కంటే ముందే జూన్ 4న ప్రకటించారు. 67 మంది విద్యా ర్థులు టాప్ లో ఉన్నారని ప్రకటించడంతో అక్రమాలు, పేపర్ లీక్ లు జరిగినట్లు ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు , ఆందోళన జరిగాయి.
ఈ కేసు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలతో కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను తొలగించింది. పరీక్షల్లో సంస్క రణ లు చేయడానికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.