నిజామాబాద్ నగరంలోని నెహ్రూ చౌక్ ఆదివారం సాయంత్రం జనంతో కిటకిటలాడింది. ప్రతి రంజాన్ మాసంలో నెహ్రూ చౌక్ జనంతో సందడిగా ఉంటుంది. ఇక్కడ మహిళలకు అవసరమైన అనేక రకాల వస్తువులు, బట్టలు తక్కువ ధరలో లభిస్తాయి.
దీంతో రంజాన్ మాసంలో ముస్లింలు , హిందువుల షాపింగ్‌తో సందడిగా ఉంటుంది. హైదారాబాద్‌లోని చార్మినార్‌లో లభించే గాజులు, అన్ని రకాల వస్తువులు నెహ్రు చౌక్ లో లభిస్తుండడంతో కొనుగోలు దారులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.