గోవాలో నేపాల్ మేయర్ కుమార్తె కిడ్నాప్.. 2 రోజుల తర్వాత ఏం జరిగింది..?

గోవాలో నేపాల్ మేయర్ కుమార్తె కిడ్నాప్.. 2 రోజుల తర్వాత ఏం జరిగింది..?

నేపాల్ దేశంలోని ఓ నగరానికి చెందిన మేయర్ కూతురు భారత్ లోని గోవాలో అదృశ్యమైన రెండు రోజుల తర్వాత ఓ హోటల్‌లో ఆచూకీ లభించింది. వివరాల్లోకి వెళ్తే గోపాల్ హమాల్ నేపాల్‌లోని ధంగధి సబ్ మెట్రోపాలిటన్ నగరం మేయర్‌. ఆయన కూతరు ఆర్తీ హామల్‌ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటుంది. గోవాలో ఉన్న కూతురు కొన్ని రోజుల కిందట అదృశ్యమవ్వడంతో మేయర్ భయబ్రాంతులకు గురయ్యాడు. కూతురు జాడ లేకపోవడంతో ఆదివారం రోజు ఆయన ఓ వీడియో చేసి సోషల్ మీడియాలోకి వదిలారు.

 "నా పెద్ద కుమార్తె ఆర్తి ఓషో ధ్యానం మరియు గత కొన్ని నెలలుగా గోవాలో నివసిస్తోంది. అయితే, ఆమె నిన్న జోర్బా బీచ్, అశ్వెం సమీపంలో ఆర్తితో సంబంధాలు కోల్పోయినట్లు ఆమె స్నేహితురాలి నుండి నాకు సందేశం వచ్చింది. గోవాలో నివసిస్తున్న వారిని నేను అభ్యర్థిస్తున్నాను. నా కుమార్తె ఆర్తి కోసం వెతకడానికి సహాయం చేయడానికి. అలాగే, మా పెద్ద కూతురు ఆర్తి కోసం వెతకడానికి నా చిన్న కూతురు అర్జూ మరియు అల్లుడు ఈ రాత్రి గోవాకు వెళ్తున్నారు. సియోలిమ్ సమీపంలోని వంతెన వద్ద ఆమె చివరిసారిగా కనిపించింది. " అని హమాల్ ఎక్స్‌లో రాశాడు. 

ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ తాము వెతుకుతామని కామెంట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు దర్యాప్తు చేశారు. ఉత్తర గోవాలోని మాండ్రేమ్‌లోని ఓ హోటల్‌లో ఆర్తి దొరికిందని గోవా పోలీసులు తెలిపారు.