చైనాతో నేపాల్ అప్రమత్తంగా ఉండాలి: రావత్

చైనాతో నేపాల్ అప్రమత్తంగా ఉండాలి: రావత్

న్యూఢిల్లీ: చైనాతో జరిపే లావాదేవీల్లో నేపాల్ జాగ్రత్తగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. ఇందుకు శ్రీలంకను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కొన్ని శతాబ్దాల నుంచి నేపాల్, భారత్‌‌కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ దేశం ఇతర దేశాలతో దోస్తీ చేయాలని చూస్తోందన్నారు. తన స్వతంత్ర్య విదేశాంగ విధానంలో భాగంగా చైనాతో జట్టు కట్టడానికి నేపాల్ ఉవ్విళ్లూరుతోందన్నారు.

అంతర్జాతీయంగా ఏ దేశంతో ఎలా ఉండాలనేది నేపాల్ ఇష్టమని, అయితే ఎవరితో దోస్తీ చేసినా శ్రీలంకలాగా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భారత్-నేపాల్ మధ్య విడదీయలేని అనుబంధం ఉందని, రెండు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత కొనసాగడమే తమకు కావాలన్నారు. నేపాల్ ఇన్‌‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ ఎంగేజ్‌‌మెంట్‌‌తో జరిగిన వార్షిక సదస్సులో బిపిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.