గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నేపాల్ మాజీ స్పీకర్ మహారా అరెస్టు

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నేపాల్ మాజీ స్పీకర్ మహారా అరెస్టు

ఖాట్మండు: గోల్డ్ స్మగ్లింగ్‎కు పాల్పడ్డారనే ఆరోపణలతో నేపాల్ మాజీ స్పీకర్ కృష్ణ బహదూర్ మహారాను ఆదివారం సీఐబీ అరెస్టు చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్టు సెంటర్ వైస్  చైర్మన్ అయిన మహారాను లలిత్ పూర్ మెట్రో పాలిటన్ సిటీలోని నివాసం నుంచి సీఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నేపాల్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. మూడేండ్ల క్రితం త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నిల్వ చేసిన రూ.85.52 మిలియన్ల విలువైన బంగారాన్ని విక్రయించిన వ్యవహారంలో ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.