నేపాల్ కొత్త మ్యాప్ కు ఎవిడెన్స్ లేవు

నేపాల్ కొత్త మ్యాప్ కు ఎవిడెన్స్ లేవు
  • అనవసర వివాదాలొద్దని ఇండియా సూచన

న్యూఢిల్లీ : లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్ కు ఇచ్చేదే లేదని ఇండియా స్పష్టం చేసింది. ఈ మూడు ప్రాంతాల విషయంలో నేపాల్ చేస్తున్న లొల్లి పై మన దేశం కోపంగా ఉంది. ఈ విషయంలో మన వైఖరెంటో నేపాల్ కు స్పష్టంగా తెలుసు అని ఫారెన్ ఎఫెర్స్ స్పోక్స్ పర్సన్ అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మూడు ప్రాంతాలను నేపాల్ లో ఉన్నట్లుగా విడుదల చేసిన కొత్త మ్యాప్ కు అసలు హిస్టారికల్ ఎవిడెన్సే లేవని ఆయన అన్నారు. అర్టిఫిషియల్ గా సరిహద్దులను మార్చటం చెల్లదని తేల్చిచెప్పారు. నేపాల్ ప్రభుత్వం ఇన్నాళ్లుగా లేని వివాదాన్ని ఈ మధ్యే కొత్తగా స్టార్ట్ చేసింది. ఇందుకు చైనా సాయం చేస్తుందని మన దేశం అనుమానిస్తుంది. ” నేపాల్ కోరుతున్న మూడు ప్రాంతాల విషయంలో ఇండియా వైఖరి ఏంటో నేపాల్ కు తెలుసు. ఇలాంటి ఆధారాలు లేని మ్యాప్ లను రూపొందించటం సరికాదని నేపాల్ సూచిస్తున్నాం. బార్డర్ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు నేపాల్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం ” అని శ్రీవాస్తవ అన్నారు. ఈ మూడు ప్రాంతాలను నేపాల్ లో భాగం అన్నట్లు రూపొందించిన మ్యాప్ ను బుధవారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ సందర్భంగా ఇండియా నుంచి మూడు ప్రాంతాలను తీసుకుంటాం అని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ అన్నారు. దీంతో మన దేశం కౌంటర్ ఇచ్చింది. అనవసర వివాదాలను సృష్టించొద్దని తెలిపింది. మానవ సరోవర్ యాత్రకు వెళ్లే వారి కోసం ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ వరకు రోడ్డు నిర్మించేందుకు 11 న తేదీన రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నేపాల్ లొల్లి మొదలుపెట్టింది.