JAAT OTT: ఓటీటీలోకి గోపీచంద్ మలినేని యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

JAAT OTT: ఓటీటీలోకి గోపీచంద్ మలినేని యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని- బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ లేటెస్ట్ మూవీ జాట్ (JAAT). ఈ మూవీ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దుమ్ములేపింది. ఇది సన్నీ డియోల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నిలిచి..బాలీవుడ్ నాట రికార్డ్ సృష్టించింది. దాదాపు రూ.120 కోట్లు వసూళ్లు చేసింది.

అయితే, ఈ మూవీ డైరెక్ట్ చేసింది తెలుగు దర్శకుడే ఐనా.. సినిమా మాత్రం హిందీలో మాత్రమే రిలీజయింది. దాంతో ఎలాగైనా సినిమాను  చూడాలని తెలుగు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ క్రమంలో సుమారు రెండు నెలల తర్వాత జాట్ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక మాస్ ఫ్యాన్స్ ఊకుంటారా? స్ట్రీమింగ్ వివరాల కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. 

జాట్ ఓటీటీ: 

జాట్ మూవీ ఇవాళ (జూన్ 5) స్ట్రీమింగ్కు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి రేపు జూన్ 6న వస్తుందని అన్నారు. కానీ, ఒకరోజు ముందుగానే ఓటీటీలో దర్శనమిచ్చింది.

►ALSO READ | రిలీజ్ వాయిదాల క్లారిటీ: జులై 4న ‘హరిహర వీరమల్లు’!..కింగ్‌‌‌‌డమ్ పరిస్థితి ఏంటీ?

ఇకపోతే, జాట్ మూవీని పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు గోపీచంద్ మలినేని. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రిలీజైన ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.120 కోట్లు వసూలు చేసింది. సన్నీ డియోల్ గత చిత్రాలు గదర్, గదర్ 2సినిమాల తర్వాత జాట్ హయ్యెస్ట్ వసూళ్లను దక్కించుకుంది.

ఈ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని భారీ సక్సెస్ అందుకున్నారు. జాట్ ఇచ్చిన సక్సెస్ తో బాలీవుడ్ మాస్ హీరోలు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ క్రమంలోనే జాట్ నిర్మాతలు మైత్రి మేకర్స్ సెకండ్ పార్ట్ తెరకెక్కంచనున్నట్లు ప్రకటించారు.